Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో ఎలక్ట్రిక్ బైక్ షోరూం ప్రారంభం

విద్యార్థులకు, రైతులకు ఉపయోగకరం
ముల్కనూర్ లో ఎలక్ట్రిక్ బైక్ షోరూం ప్రారంభం
విద్యార్థులకు, రైతులకు ఉపయోగకరం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్ :
భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఇటుగో కంపెనీకి సంబంధించిన ఎకోస్పియర్ సొల్యూషన్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూంను గురువారం ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ బైకులు గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు, విద్యార్థులకు, రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ ఎలక్ట్రిక్ బైకులు అనువుగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ బైకులను ఒకసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఈ ఎలక్ట్రిక్ బైకులు కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఊసకోయిల ప్రకాష్, అన్నవరపు కిరణ్, ఉడుత విటోబా, దొంగల కొమురయ్య, బొజ్జపూరి మురళి, దొంతరబోయిన వెంకటేశ్వర్లు, మధుకర్ శర్మ, కాసగోని భాస్కర్, రణధీర్ రెడ్డి, వన రాజు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.