Bheemadevarapally: వినాయక నిమజ్జనంలో డీజేల మోత బంద్
On

ముల్కనూర్ ఎస్సై రాజు
వినాయక నిమజ్జనంలో డీజేల మోత బంద్
ముల్కనూర్ ఎస్సై రాజు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలంలో వినాయక నిమజ్జన సమయంలో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం ఉన్నట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు. భీమదేవరపల్లి మండలంలోని డీజే యజమానులతో ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. డీజే లతో పెరుగుతున్న శబ్ద కాలుష్యం, మితిమీరిన చప్పుడుతో మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం తదితర కారణాలతో డీజే మోతలను ఆపాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధిక శబ్ధం కలిగించే డిజే లను వినియోగించరాదన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఉల్లంఘించి, ఎవరైనా వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో పోలీసు వారికి సహకరించాలని సూచించారు.
Views: 321
Tags: