Bheemadevarapally, Mulkanoor: ఈరల్ల శ్రీనివాస్ గుర్తుగా స్టీల్ ప్లేట్ల పంపిణీ
ఫ్రెండ్షిప్ అంటే ఇదేగా....
On

స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటాం
ఈరల్ల శ్రీనివాస్ గుర్తుగా స్టీల్ ప్లేట్ల పంపిణీ
ఫ్రెండ్షిప్ అంటే ఇదేగా....
స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటాం
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రుడు ఈరల్ల శ్రీనివాస్ అకాల మరణంతో అతని కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన ఈరల్ల శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. శ్రీనివాస్ స్నేహితులంతా కలిసి తన మిత్రుని జ్ఞాపకార్ధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జాలి ప్రమోద్ రెడ్డి, జక్కుల అజయ్,గోలి రవి,జక్కుల రాజు, భూపతి శ్రీకాంత్, జక్కుల అనిల్, దొంతర బోయిన శ్రీనాథ్, అశోక్, నటరాజ్, రాజేంద్ర నాయక్, గజ్జల శ్రీకాంత్, జోగుల విజయ్, తోటి మిత్రులు పాల్గొన్నారు.
Views: 183
Tags: