Bheemadevarapally, Vangara: వంగరలో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

On
Bheemadevarapally, Vangara: వంగరలో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వంగర పోలీసులు

వంగరలో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వంగర పోలీసులు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

బావిలో దూకి వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన దాడి భూమయ్య(78) లక్ష్మి (70) అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు గతంలో మృతి చెందారు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో లక్ష్మీ తన భర్త భూమయ్యతో మన బాగోగులు ఎవరు చూసుకుంటారు అని చెప్పుకుంటూ బాధపడేది. భర్త భూమయ్య భార్యకు సర్థి చెబుతూ ధైర్యం చెప్పేవాడు. లక్ష్మి  మానసికంగా కృంగిపోయి జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో నుండి తన భర్తకి చెప్పకుండా వెళ్లిపోయింది. సోమవారం నాడు కుటుంబ సభ్యులు లక్ష్మీ కోసం వెతుకుతుండగా గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావిలో లక్ష్మీ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం హుజురాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మృతురాలి భర్త దాడి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఎస్సై దివ్య తెలిపారు.

Also Read:  Bheemadevarapally: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి 

Views: 92
Tags:

About The Author

Latest News