Bheemadevarapally: నిషేధిత పొగాకు ప్యాకెట్లు పట్టివేత

ముల్కనూర్ ఎస్సై రాజు 

On
Bheemadevarapally: నిషేధిత పొగాకు ప్యాకెట్లు పట్టివేత

పొగాకు ఉత్పత్తులను విక్రయించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు 

నిషేధిత పొగాకు ప్యాకెట్లు పట్టివేత

పొగాకు ఉత్పత్తులను విక్రయించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు 

ముల్కనూర్ ఎస్సై రాజు 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

నిషేధిత పొగాకు ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం నాడు ముల్కనూర్ పోలీసులు పట్టుకున్నారు. ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాల మేరకు మండలంలోని భీమదేవరపల్లి క్రాస్ రోడ్ వద్ద ఓ వ్యక్తి చేతిలో బ్యాగు పట్టుకొని అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి బ్యాగ్ తనిఖీ చేయగా సుమారుగా 7500 విలువగల నిషేధిత పొగాకు పొట్లాలు లభ్యమయ్యాయి. నిందితుని వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిందితుని వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమలాపూర్ గ్రామానికి చెందిన రాయవేణి మల్లయ్య గా గుర్తించారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు  విక్రయించిన, సరఫరా చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం..

Views: 321
Tags:

About The Author

Latest News