Bheemadevarapally, Mulkanoor: ముత్యం కుమార్ కూతురికి రెండు గోల్డ్ మెడల్స్ 

On
Bheemadevarapally, Mulkanoor: ముత్యం కుమార్ కూతురికి రెండు గోల్డ్ మెడల్స్ 

హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు

ముత్యం కుమార్ కూతురికి రెండు గోల్డ్ మెడల్స్ 

హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

ముల్కనూర్ విద్యార్థిని మోర సిరిచందన రెండు బంగారు పతకాలు అందుకుని శభాష్‌ అనిపించుకున్నది. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన మోర కుమార్- లతల(ముత్యం డిజిటల్స్) కూతురు సిరిచందన ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్  (EEE) విభాగంలో పూర్తిచేసినది. విశ్వవిద్యాలయం పరిధిలో టాపర్‌గా నిలిచి బంగారు పతకం, (EEE) విభాగం లో ప్రతిభ చూపి రెండు బంగారు పతకాలు సాధించింది. ఈ అవార్డులను ఓయూ వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా స్వీకరించింది. ఈ సందర్భంగా సిరిచందన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషితోనే టాపర్‌గా నిలిచానన్నారు. సిరిచందన బంగారు పతకాలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.IMG-20250830-WA0062

Also Read:  Bheemadevarapally, Mulkanoor: భక్త మార్కండేయ గుడిలో అట్టహాసంగా జంధ్యాల పూర్ణిమ

Views: 717
Tags:

About The Author

Latest News