Bheemadevarapally, Muttharam: రోడ్డు పక్కన చెట్ల తొలగింపు
On

ఎస్సై రాజు పనితీరును ప్రశంసించిన వాహనదారులు
రోడ్డు పక్కన చెట్ల తొలగింపు
ఎస్సై రాజు పనితీరును ప్రశంసించిన వాహనదారులు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం నుండి కొత్తకొండ వెళ్లే దారిలో మూల మలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు, కొమ్మలు, ముళ్ళకంపలతో ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు గురువారం నాడు ముల్కనూర్ ఎస్సై రాజు జేసీబిని తెప్పించి చెట్లు, కొమ్మలను తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ.. రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు పెరగడం వల్ల పలు సందర్భాల్లో వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారన్నారు. వాహనదారులు సురక్షితంగా వెళ్లడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఎస్ఐ పనితీరును వాహనదారులు ప్రశంసించారు.
Views: 216
Tags:
About The Author
Related Posts
Latest News
18 Sep 2025 13:04:28
ఎస్సై రాజు పనితీరును ప్రశంసించిన వాహనదారులు