Bheemadevarapally, Ratnagiri:రత్నగిరి లో పేకాట స్థావరం పై దాడి
4 గురు అరెస్ట్, మొబైల్ ఫోన్ లు స్వాదీనం

పేకాట చట్ట విరుద్ధం, ఎవరైనా ఆడితే చట్టపరమైన చర్యలు
రత్నగిరి లో పేకాట స్థావరం పై దాడి
4 గురు అరెస్ట్, మొబైల్ ఫోన్ లు స్వాదీనం
పేకాట చట్ట విరుద్ధం, ఎవరైనా ఆడితే చట్టపరమైన చర్యలు
వంగర ఎస్సై దివ్య
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
రత్నగిరి గ్రామ శివారులో శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని నగదును, 4 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వంగర ఎస్సై దివ్య కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఐ దివ్య పోలీసులతో కలిసి పేకాట స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్ లను పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేకాట చట్ట విరుద్ధమని, ఎవరైనా ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై దివ్య హెచ్చరించారు.