Bheemadevarapally, Mulkanoor: ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులు
బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు

గత 13 ఏళ్లుగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు
ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులు
బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు
గత 13 ఏళ్లుగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని వివేకనంద యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి, అమ్మవారిని అలంకరించి పురోహితులు శివ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో కుల,మతాల అతీతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత బసవరాజుల రమేష్ అనూష, ఉడుత విటోభ, శ్రీనాథ్, పోతుగంటి రాకేష్, సకినాల రమేష్, బైరి రాంబాబు, దూలం జగన్, కీర్తి లవన్, లోకేష్, గణేష్, చరణ్, లల్లు, సుకృత్, విశ్రుత్, అనిరుద్, శ్రీలత, మాధవి, సునీత, రాధిక, సుకన్య, సింధూజ, నిఖిత, యశస్విని, సహస్ర, రిషిత, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.