Bheemadevarapally, Kothaplly: ఆదర్శంగా నిలుస్తున్న కొత్తపల్లి పురుషుల పొదుపు సంఘం

ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు
ఆదర్శంగా నిలుస్తున్న కొత్తపల్లి పురుషుల పొదుపు సంఘం
-ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పురుషుల సంఘం -1 బుధవారం నాడు సిల్వర్ జూబ్లీ వేడుకలు అధ్యక్షులు సల్పాల సురేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పురుషుల సంఘం130 సభ్యులతో ప్రారంభమై నేటికి 450 సభ్యులతో రూ.1.30 లక్షల లావాదేవీలలో నడుస్తున్నట్లు తెలిపారు. కుటుంబ అవసరాలకు, స్వయం ఉపాధి కోసం రుణాలు కావాలంటే తక్కువ వడ్డీతో తక్షణమే రుణాలు మంజూరు చేస్తు కుటుంబ అవసరాలకు, వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడుతూ ఆదర్శంగా నిలుస్తుందని సభ్యులు తెలిపారు. సభ్యులు చనిపోతే దహన సంస్కారాలకు రూ. 45 వేలు అందజేస్తారు. అనారోగ్యంతో మృతి చెందితే రూ.70వేలు, ప్రమాదంలో చనిపోతే రూ.2లక్షలు ఇస్తూ మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సహవికాస డిఓ సుమలత, సమితి అధ్యక్షులు జాన ప్రవీణ్, నరాల తిరుపతిరెడ్డి, సమితి గణకులు బిక్షపతి, రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు నాయిని శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు మేకల బిక్షపతి, బోనాల దేవేందర్, అప్పని రవీందర్, ఓదేల్, సారయ్య, వేణు, రాజు, శ్రీను, రాకేష్, కుమార్, అశోక్ పాల్గొన్నారు.