Bheemadevarapally, Kothakonda: ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు తీసుకుంటే క్రిమినల్ కేసులు
On

మంత్రి పొన్నం ప్రభాకర్
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు తీసుకుంటే క్రిమినల్ కేసులు
-మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం తన 58వ పుట్టినరోజు సందర్భంగా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో పారదర్శకత పాటించకపోతే చర్యలు తప్పవని అన్నారు. ఇళ్ల ఎంపికలో డబ్బులు తీసుకోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన, వేరే పార్టీ కార్యకర్తలైన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డబ్బులు తీసుకున్నట్లయితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
Views: 64
Tags:
About The Author
Related Posts
Latest News
10 Jul 2025 21:19:42
అధికారులు న్యాయం చేసేనా..?