Bheemadevarapally, Mulkanoor: మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం
ముల్కనూర్ డెయిరీలో మహిళల కోసం క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

డాక్టర్ రుబీనా
మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం
ముల్కనూర్ డెయిరీలో మహిళల కోసం క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
డాక్టర్ రుబీనా
భీమదేవరపల్లి రాజముద్ర డెస్క్:
క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశల్లోనే గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ రుబీనా అన్నారు. బుధవారం నాడు భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ డెయిరీలో క్యాన్సర్ పై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు, అలాగే తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై సమగ్రమైన సమాచారాన్ని అందించారు. క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశల్లోనే గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చనే సందేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించి, స్క్రీనింగ్ ద్వారా ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో కీలకమని వైద్యులు వివరించారు. మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రతి మంగళ వారం మహిళలకి ఆరోగ్య మహిళ ప్రోగ్రామ్ ద్వారా Special Health Checkup నిర్వహిస్తున్నాం అని ఈ సేవలను వినియోగించు కోవాలి అని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో NCD ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అహ్మద్, డాక్టర్ రహమాన్, డాక్టర్ రూబీనా, సూపర్వైజర్ వాణి, ఆశా వర్కర్ శ్యామలా , స్వరూప, పాల్గొన్నారు.