Thousand pillar temple: కాకతీయ కళావైభవం వేయిస్తంభాల గుడి
మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబు
On

వరంగల్ - రాజముద్ర న్యూస్: కాకతీయుల కళావైభవానికి, భక్తి పారవశ్యానికి నిలయం హన్మకొండ వేయి స్తంభాల దేవాలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవ వేడుకల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. భక్తి భావంతో పాటు ఆలయంలో శిల్పకల ఉట్టిపడుతుంది. వేయి స్తంభాల దేవాలయాన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. వేయి స్థంబాల పేరుతో నిర్మితమైన ఆలయ వైభవం నేటికి కొనసాగుతుంది. ఈ దేవాలయంలో శివలింగాన్ని రుద్రేశ్వర స్వామిగా కొలుస్తారు. అంతేకాదు వేయిస్థంభాల దేవాలయానికి మరో విశిష్టత ఉంది. శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వేలాదిగా భక్తులు స్వామి వారిని అభిషేకిస్తారు. దీంతో ఇక్కడ శివునితోపాటు విష్ణుమూర్తి, సూర్య భగవానుడు కొలుపుదీరాడు. 850 ఏళ్ల ఘనచరిత కలిగి దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందీ ఆలయం. క్రీ.శ. 1163లో కాకతీయుల రాజు రుద్రదేవుడి హయాంలో వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించారు. వేయి స్తంభాలతో ఆలయంతో పాటు ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపాన్ని అత్యంత సుందరనీగా తీర్చిదిద్దారు. కాకతీయులు శివభక్తులు కావడంతో వేయిస్తంభాల దేవాలయంలో భారీ ఆకారంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్టించారు. శైవ క్షేత్రాల్లో సాధారణంగా శివునికి, శివలింగానికి ఎదురగా నందీశ్వరుడు ఉంటారు. కానీ వేయిస్తంభాల దేవాలయంలో బిన్నంగా సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఈ ఆలయం మరో విశిష్టతను కల్గిఉంది. హరిహర వేదాలు రాకుండా ఆలయానికి త్రికూటాలయంగా నామకరణం చేసి శివునికి ఎడమై వైపున విష్ణుమూర్తిని, ఎదురుగా సూర్యభగవానున్ని ప్రతిష్టించారు. విష్ణుమూర్తి కి నిత్యకళ్యాణం మచ్చతోరణం అన్నట్లు నిత్యపూజలు జరుగుతాయి. కాబట్టి విష్ణుమూర్తికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం విగ్రహం వెనకాల కళ్యాణమండపం నిర్మించారు. ఇక్కడ శివునితోపాటు విష్ణుమూర్తి, సూర్యభగవానుడు నిత్య పూజులు అందుకోనేవారు. ఆలయంలోని శివలింగంపై ఉదయం 5 గంటల 30 నిమిషాలు 6 గంటల మధ్యంలో సూర్యకిరణాలు నేరుగా పడతుంటాయి.
Views: 17
Tags:
About The Author
Related Posts
Latest News
13 Jul 2025 17:15:01
విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికీ మరువబోవద్దు