జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
ఘనంగా పప్పుల అంజిరెడ్డి జన్మదిన వేడుకలు
On

26వ డివిజన్లో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన డివిజన్ ప్రజలు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు
Medipally - Rajamudra News: జనహృదయనేత, పేద ప్రజల పాలిట ఆశాజ్యోతి, రాజకీయ దురంధరుడు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి జన్మదిన వేడుకలు 26వ డివిజన్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. 26వ డివిజన్ పరిధిలోని పలు కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, డివిజన్ ప్రజలు యూత్ నాయకులు పప్పుల అంజిరెడ్డి తో కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్పొరేషన్ పరిధిలో అంజిరెడ్డి సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహా నాయకుడని కీర్తించారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే ఏకైక నాయకుడు అంజిరెడ్డి అని కొనియాడారు. నిరంతరం డివిజన్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింతగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వారికి కల్పించాలని, రాబోవు రోజుల్లో రాజకీయంగా అనేకమైన ఉన్నతమైన పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. పప్పుల అంజిరెడ్డి జన్మదినం సందర్భంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డివిజన్ ప్రజలకు నాయకులకు కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చి బాబు రాజు, సందీప్, చిన్నరాయుడు, వర్మ, సుధీర్, సాజిద్, సాయి చరణ్, భవాని శంకర్, బాలాజీ, సంతోష్, ఓం,హరీష్, అఖిల్, శ్రీకాంత్, మధుసూదన్, తరుణ్, సాయి సోమశేఖర్, అరుణ్, చందు, ఆనంద్, సాయి సురేందర్, సాయి, అనిల్ , అసిఫ్, సుమంత్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 45
Tags:
About The Author
Latest News
30 Jul 2025 13:39:03
పాత్రికేయ మిత్రులకు సన్మానం