Bheemadevarapally, Mulkanoor: మైక్రో ఫైనాన్స్ అప్పులు తీర్చలేక మనోవేదనతో యువకుడు మృతి

కిరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీవాసుల విజ్ఞప్తి
మైక్రో ఫైనాన్స్ అప్పులు తీర్చలేక మనోవేదనతో యువకుడు మృతి
కిరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీవాసుల విజ్ఞప్తి
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
మైక్రో ఫైనాన్స్ అప్పులు తీర్చలేక మనోవేదనతో యువకుడు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో శుక్రవారం నాడు చోటుచేసుకుంది. భార్య రుచిత తెలిపిన వివరాల ప్రకారం ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల కిరణ్ (35) సుతారి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిల రీత్యా అతను ఇటీవలే ఐదు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సంబంధించిన వాటి ద్వారా మూడు లక్షల వరకు రుణం తీసుకున్నాడు. భార్యభర్తలిద్దరూ కూలి పని చేసుకుంటూ అప్పులు సకాలంలో తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో బిల్డింగు నిర్మాణం పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిరణ్ చేయికి గాయం కావడంతో పది కుట్లు పడ్డాయి. అనారోగ్యం రీత్యా పనికి వెళ్లకపోవడం మైక్రోఫైనాన్స్ సంస్థలకు అప్పులు కట్టలేక ఎప్పుడు దిగులుగా ఉండేవాడని ఆమె తెలిపింది. భర్త బాధను చూడలేక కుటుంబ సమస్యలను తీర్చడం కోసం బుధవారం నాడు రుచిత తన తల్లి ఇంటికి వెళ్ళింది. గురువారం నాడు పనికి వెళ్లిన కిరణ్ తన భార్య రుచిత కు ఫోన్ చేసి టెన్షన్ అవుతుందని చెప్పాడు. శుక్రవారం ఉదయం ఆమె ఫోన్ చేసినప్పటికీ రెస్పాన్స్ కాకపోవడంతో ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించగా కిరణ్ మంచంపై విగత జీవి లాగా కనిపించాడు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన దంపతుల్లో కుటుంబ యజమానిని కోల్పోవడంతో చిన్నారులైన ప్రజ్ఞ, నైనికల ను చూసి కాలనీవాసులు కంటతడి పెట్టారు. కిరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.