Bheemadevarapally: అవగాహనతోనే కుష్టు వ్యాధి నివారణ
సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చు

డాక్టర్ రుబీనా
అవగాహనతోనే కుష్టు వ్యాధి నివారణ
సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చు
డాక్టర్ రుబీనా
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
అవగాహనతోనే కుష్టు వ్యాధిని నివారించవచ్చని వంగర ఉన్నతశ్రేణి ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ రుబీనా అన్నారు.హన్మకొండ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు కొత్తపల్లి, భీమదేవరపల్లి, వంగర గ్రామాలలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్థాయి నిపుణుల బృందం గ్రామాలను సందర్శించి, ప్రజల్లో కుష్ఠు వ్యాధి గురించిన అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఏప్రిల్ లో ఆశ కార్యకర్తలచే జరిగిన సర్వే లో ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నారో వారిని ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రటి, తెల్లటి, స్పర్శ లేని మచ్చలు ఉన్న అనుమానిత వ్యక్తులను పరీక్షించి, అవసరమైన వైద్యం అందించారు. సకాలంలో వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని డాక్టర్లు తెలిపారు. వడదెబ్బ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సంరక్షణ చర్యలపై సైతం వివరంగా ప్రజలకు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విద్యాధికారి DHEO శ్రీనివాస్, వంగర వైద్యులు డా. రెహమాన్, డా. రుబీనా, డా. దినేష్, డా. రాజశేఖర్, సూపర్వైజర్ మోహన్, స్థానిక ANM, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం మరింత పెరుగుతుందన్నారు.