Bheemadevaraplly, Mangalapalli: అక్రమంగా తరలిస్తున్న దూడలు పట్టివేత

వంగర ఎస్సై దివ్య
అక్రమంగా తరలిస్తున్న దూడలు పట్టివేత
-వంగర ఎస్సై దివ్య
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
మండల పరిధిలోని రాంనగర్ బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం వంగర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న దూడలను పట్టుకున్నారు. ఎస్సై దివ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హుస్నాబాద్ వైపు నుండి వస్తున్న మహేంద్ర బొలెరో ట్రాలీ (TS 02 UD1852)ని తనిఖీ చేయగా 3 దూడలను బక్రీద్ పండుగ సందర్భంగా దూడలను కోసి అధిక ధరలకు మాంసం అమ్ముకొని ఎక్కువ లాభాలు పొందవచ్చనే ఉద్దేశంతో దూడలను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా దూడలను తరలిస్తున్న Md జాఫర్, R/O జమ్మికుంట, ఇబ్రహీం, R/O జమ్మికుంట, కనకం సదానందం R/O జమ్మికుంట, డ్రైవర్ ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దివ్య చెప్పారు. దూడలను ధర్మసాగర్( ముప్పారం) గోశాలకు తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు. కాగా పశువులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఎస్సై దివ్య, Probationary Sub-Inspector హేమలత, కానిస్టేబుళ్లు రమేష్, రాజు లను సీఐ రమేష్ గౌడ్ అభినందించారు.