Double Bedroom Houses: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అక్రమ వసూళ్లు 

• కుత్బుల్లాపూర్ లో నిరుపేదలను పీక్కుతింటున్న రాబందులు

On
Double Bedroom Houses: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అక్రమ వసూళ్లు 

Double Bedroom Houses: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ నిరుపేదలను పీక్కుతింటున్న  రాబందులు.

 ప్రభుత్వ అనుమతి ఉన్నా... వీరి అనుమతి తప్పనిసరిగా అయ్యింది. దీనికి తోడు నాయకుల ముసుగులో అక్రమ వసూళ్లు. 

 పూర్తి కేటాయింపులు జరగనే లేదు... గద్దల్లా వాలారు... మెయింటెనెన్స్ పేరిట ప్రతినెల రూ. 1000 వసూలు

- సభ్యత్వం పేరుతో మరో రూ.1100 డిమాండ్
- ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సి ఉంటుందని మరో రూ.100 బాదుడు. 

కుత్బుల్లాపూర్, రాజముద్ర న్యూస్ :

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదల కోసం కేటాయించింది. అధికార పూర్వకంగా ధృవీకరణ పత్రాలు లబ్ధిదారులకు అందించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కేటాయింపులు జరగదు. అయితే కొందరు నిరుపేదలు ఇంటి కిరాయి కట్టుకోలేని పరిస్థితులలో ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. దీంతో ఆ నిరుపేదలను కొందరు రాబందుల్లా పిక్కు తింటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మెయింటెనెన్స్ పేరుతో, సభ్యత్వం పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లి లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో గత కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు తమకు తామే నాయకులుగా ప్రకటించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే కొందరు మెయింటెనెన్స్ పేరుతో ఒక్కో ఇంటికి నుండి ప్రతినెల రూ.1000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సభ్యత్వం పేరుతో మరో రూ 1100.  వసూలు చేస్తున్నట్లు సమాచారం. 
ప్రతి నెల ఆ నాయకులకు సులభంగా ఆదాయం వచ్చే విధంగా పావులు కలుపుతున్నట్లు సమాచారం. 900 ఇండ్ల నుండి ప్రతి ఒక్కరి నుండి రూ.1000 రూపాయలు వసూలు చేస్తే, రూ 9 లక్షల రూపాయలు వసూలు అవుతుంది. ప్రతి నెల 9 లక్షల రూపాయలు ఖర్చు కాదు కదా... అని ప్రశ్నిస్తే, అడిగిన వారిని టార్గెట్ చేసి పలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. 8 బ్లాక్ లకు గాను 900 ప్లాట్లు నిర్మించారు. వీటిలో 780 ప్లాట్లను మాత్రమే పంపిణీ చేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడ ఇల్లు కేటాయించడంతో ఇక్కడ స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇక్కడ స్థానికులు తామే నాయకులమని ప్రకటించుకుని ప్రతినెల మెయింటినెన్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఎక్కువమంది స్థానికేతరులే కావడంతో ఈ నాయకులు చెప్పిందే వేదం చేసిందే కార్యంగా తయారయింది. ఇప్పటికే ఇక్కడ ఆ వ్యక్తులు నాయకుల ముసుగులో లక్షల్లో వసూళ్లు చేసినట్లు సమాచారం. 

Also Read:  Jagityala, Korutla: జగిత్యాల జిల్లాలో దారుణం

సభ్యత్వం ముసుగులో అక్రమ వసూళ్లు 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: పాత్రికేయులతో సమాజంలో మార్పు సాధ్యం

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఉన్నవారికి సభ్యత్వం తీసుకోవాలని అందుకు ఒక్కొక్క ఇంటి నుండి రూ. 1100 రూపాయలు చెల్లించాలని ఆ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో 100 రూపాయలు ప్రభుత్వానికి వెళుతుందని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆ ఇళ్లలోకి పూర్తిస్థాయిలో లబ్ధిదారులు రాలేదు, కేటాయింపులు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదు. మరి నాయకుల ముసుగులో ఈ అక్రమ వసూళ్లు ఏంటని పలువురు బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఇళ్లకు నీటి సరఫరాను, విద్యుత్ మీటర్లను తీసుకువచ్చామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. 900 గృహాలను నిర్మించిన ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరా చేయలేదా...?  అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులందరూ గృహప్రవేశాలు చేసిన తర్వాత ప్రతి నెల మెయింటెనెన్స్ వసూలు చేసిన, ఇంటికి రూ.1000 రూపాయలు వసూలు చేసిన రూ.9లక్షల రూపాయలు అవుతుందని, ప్రతినెల అంతా ఖర్చు ఎందుకు అవుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అసలు అసోసియేషన్ లేదు..? కమిటీ లేదు..? కొందరు ప్రతి నెల ఈజీ మనీ కోసం చేస్తున్న ప్రయత్నంగా ఉందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 

Also Read:  Bheemadevarapally: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి 

దుకాణాల అద్దె డబ్బులు ఎవరికి...?

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో నిర్మించిన దుకాణాల నుండి వచ్చే ఆదాయంతోనే మెయింటెనెన్స్ చేయాలని గతంలోని గత  ప్రభుత్వం ప్రతిపాదించింది ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నప్పటికీ ఈ దొంగ నాయకులు అవి ఏమీ పట్టించుకోకుండా ప్రతి నెల మెయింటెనెన్స్ వసూళ్లకు సిద్ధం కావడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం నిరుపేదల నుండి మెయింటెనెన్స్ వసూలు చేయకుండా ఉండేందుకు అక్కడ వ్యాపార సముదాయాలను నిర్మించి, వాటి నుండి వచ్చే ఆదాయాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల మెయింటనెన్స్ కు ఉపయోగించాలని ప్రతిపాదించింది. 

ఇక్కడ ఉండాలంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... వీరి అనుమతి తప్పనిసరి

ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లాలంటే ముందుగా ఈ నాయకులు అనుమతి ఉండాల్సిందే. ఎవరైనా కొత్తగా వచ్చిన ఈ నాయకులను కలిసి వీరికి ఇవ్వాల్సింది ఇచ్చి ఇళ్లలోకి వెళ్తున్నారు. ఒకవేళ లబ్ధిదారులు కొంతమంది ఇటీవల చనిపోగా, వారి పిల్లలు వారికి కేటాయించిన ఇల్లు లోకి ఉండేందుకు వాస్తే, మీరు ఎవరు..? అసలు లబ్ధిదారులు ఎక్కడున్నారు...? అని బెదిరించి తిరిగి పంపివేస్తున్నట్లు సమాచారం. మా అమ్మ ఇటీవల కాలంలో మరణించిందని కాళ్ల వేల్ల పడి పెట్టుకున్న కనికరించడం లేదని తెలుస్తోంది. చాలామందిని వెనక్కి పంపిన సంఘటనలు చాలానే ఉన్నాయని అక్కడి స్థానికులు వాపోతున్నారు. లబ్ధిదారులపై వీళ్ల పెత్తనం ఏందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మెయింటెనెన్స్, సభ్యత్వం పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

Views: 221
Tags:

About The Author