Peerzadiguda Municipal Corporation: హస్తగతమైన పీర్జాదిగూడ నగర మేయర్ పీఠం

• పంతం నెగ్గించుకున్న మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి. మేయర్ అభ్యర్థిగా అమర్ సింగ్

On
Peerzadiguda Municipal Corporation: హస్తగతమైన పీర్జాదిగూడ నగర మేయర్ పీఠం

జక్కా పదవికి బొక్క పెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు 

Peerzadiguda Municipal Corporation: 

 

Also Read:  Bheemadevarapally, Mulkanoor : నరహరితండాలో గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్ 

పీర్జాదిగూడ నగరంలో మేయర్ పీఠం హస్తగతమైంది

* అమర్ సింగ్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు

IMG_20240807_200900
* అవిశ్వాసానికి మద్దతుగా 21 మంది కార్పొరేటర్లు 
* హాజరుకాని ఐదుగురు బిఆర్ఎస్ కార్పొరేటర్లు 
* కలెక్టర్ తేదీ ప్రకటించగానే మేయర్ గా అమర్ సింగ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం 

IMG_20240809_162156

Also Read:  Bheemadevarapally: అభిమానం.. రక్తదానం 

అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.... ఈ పాటలోని చరణాలకు మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆలోచనలకు నిలువుట అద్దం పడుతుంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా మేయర్ గా కొనసాగుతూ కార్పొరేటర్లందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిందే ఆటగా... పాడిందే పాటగా... ఏకపక్ష నిర్ణయాలతో, ఒంటెద్దు పోకడలతో పీర్జాదిగూడ నగర ఖజానాను నీళ్లలాగా ఖర్చు చేస్తూ బ్రష్టు పట్టించారన్నారు. తను చెప్పిందే వేదముగా భావించాలంటూ కార్పొరేటర్లకు హుకుం జారీ చేస్తూ, హంగు హార్భాటాలతో పీర్జాదిగూడ నగరాన్ని పాలించాడు. కార్పొరేటర్లు చేసేదేమీ లేక తను చెప్పిందే తలూపారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పతనం అవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకా చకా జరిగిపోయింది. ఇంకేముంది పీర్జాదిగూడ నగరంలో మేయర్ పీఠానికి ఎసరు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తన రాజకీయ అనుభవానికి పదును పెట్టి, కార్పొరేటర్ లను తన వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తూ శిష్యునిగా ఉన్న జక్కా వెంకట్ రెడ్డిని కుర్చీ నుండి లేపేశారు. 
పీర్జాదిగూడ, రాజముద్ర న్యూస్:

గత 8 నెలలుగా సందిగ్ధంలో ఉన్న అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. పీర్జాదిగూడ నగర మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లో మొత్తం 26 మంది కార్పొరేటర్లు ఉండగా అవిశ్వాసానికి 21 మంది కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. దీనితో మేయర్ గా కొనసాగిన జక్కా వెంకట్ రెడ్డి పదవిని కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా జక్కా వెంకట్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. శుక్రవారం ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి సమక్షంలో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు 21 మంది సై అన్నారు. దీనితో మేయర్ జక్కా వెంకటరెడ్డి పదవి కోల్పోక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ అభ్యర్థిగా అమర్ సింగ్ ను ఎన్నుకున్నారు.  మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించగానే 12వ డివిజన్ కార్పొరేటర్ అమర్ సింగ్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని 20 కార్పొరేటర్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ లు చక్రం తిప్పుతూ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్ లను తమ వైపు తిప్పుకోవటంలో సఫలీకృతులయ్యారు. డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ తో సహా 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి మేయర్ పై వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనితో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పంతం నెగ్గినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి జై కాంగ్రెస్.. జై రేవంత్ రెడ్డి.. జై సుధీర్ రెడ్డి.. అంటూ నినాదాలు ఇచ్చారు.  తొడగొట్టిన మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తోక ముడవాల్సి వచ్చింది. 

IMG-20240809-WA1113

Also Read:  Bheemadevarapally, Mulkanoor: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 

అభివృద్ధిలోనూ విజయం సాధిస్తాం: మేయర్ అభ్యర్థి అమర్ సింగ్ 

 

గత నాలుగున్నర సంవత్సరాలు మేయర్ గా పనిచేసిన వెంకట్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో కార్పొరేషన్ ఆదాయాన్ని బ్రష్టు పట్టించాడని తెలిపారు. సొంత డబ్బులతో పని చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని అన్నారు. గొప్పలకు పోయి ఖజానాను మొత్తం లూటీ చేసిన ఘనత జక్కా వెంకటరెడ్డికి దక్కుతుందని అన్నారు. ఏది ఏమైనా పిర్జాదిగూడ నగర ప్రజలకు చీకటి రోజులు పోయాయని, నగరానికి పట్టిన దరిద్రం పోయిందని అన్నారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశం పెడితే వెంటనే పెద్దల మెప్పుకోసం ఆ పథకాన్ని పీర్జాదిగూడ నగరంలో ఎవరి అనుమతి లేకుండా ఇస్టారాజ్యాంగా నిధులను ఖర్చు చేస్తూ దివాలా తీయించాడు. అతని ధోరణి నచ్చకే మెజారిటీ కార్పోరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. ఈ 5 నెలలు కష్టపడి పనిచేసి, పీర్జాదిగూడ నగరాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులను కలిసి అభివృద్ధికి సహకరించే విధంగా వివరిస్తూ నిధులను మరింతగా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పీర్జాదిగూడ కమాన్ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, ఎస్ ఎన్ డి పి ప్రాజెక్ట్ పనులు ముందుకెళ్లే విధంగా చర్చలు జరుపుతామని అన్నారు. అదేవిధంగా మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి డివిజన్ లో క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహకరించిన కార్పొరేటర్ లందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు,  కార్యకర్తలకు, పీర్జాదిగూడ నగర ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, కార్పొరేటర్లు బొడిగె స్వాతికృష్ణ గౌడ్, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మాడుగుల చంద్రకళ చంద్రారెడ్డి, పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి, తూముకుంట్ల ప్రసన్న లక్ష్మి శ్రీధర్ రెడ్డి, కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్, కౌడే పోచయ్య, బండి రమ్య సతీష్ గౌడ్, కె. సుభాష్ నాయక్, బండారి మంజుల రవీందర్, బచ్చరాజు, యాసారం మహేశ్వరి మహేష్, వీరమల్ల సుమలత, పాశం శశిరేఖ బుచ్చి యాదవ్, అలువాల సరిత దేవేందర్ గౌడ్, పిట్టల మల్లేష్, మద్ది యుగేందర్ రెడ్డి, ఎంపల్ల అనంతరెడ్డి, బి. శారద, కోఆప్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర్ రెడ్డి, చెరుకు వరలక్ష్మి పెంటయ్య, ఇర్ఫాన్ ఖాన్, దర్గా దయాకర్ రెడ్డి, దేశగోని శ్రీనివాస్ గౌడ్, పాశం రాజు యాదవ్, సునీల్, ప్రశాంత్, అశోక్ రెడ్డి, కె.వి గౌడ్, యువ నాయకులు చిలుముల అజయ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Views: 1005

About The Author

Latest News