Suryapet: నిరంతర సాధనతో అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచిన బాలిక

• అన్రేటెడ్ ప్రిన్సెస్ ఆఫ్ ది వరల్డ్ 2024  ఫైనల్స్ లో సూర్యాపేట బాలిక

On
Suryapet: నిరంతర సాధనతో అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచిన బాలిక

అభినందించిన సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజముద్ర, వెబ్ డెస్క్: ప్రతిభకు ఏదీ అడ్డురాదు మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని నిరూపిస్తుంటారు కొందరు. సూర్యాపేటకు చెందిన కప్పల ఇందిర  అకుంఠిత దీక్ష, నిరంతర సాధనతో ప్రతిష్టాత్మమైన కమిషన్ ఫర్ ఉమెన్ చెస్, వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే సంయుక్తంగా టోర్నలో వేదికగా నిర్వహించిన క్వీన్స్ ఆన్లైన్ ఫెస్టివల్ 2024  లో రాడికల్ చెస్ అకాడమీకి చెందిన కప్పల ఇందిర అండర్ 16 విభాగంలో ఏడు ఆరు రౌండ్లు గెలిచి ఫైనల్ కు ఎంపిక అయింది.

లీగ్ దశలో 193 దేశాలు క్రీడాకారులు పాల్గొన్నారు: 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 


ఆసియా యూరప్ అమెరికా ఆఫ్రికా ఖండాల నుంచి 400 పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో ఏడుకు ఆరు పాయింట్లు గెలిచి ఫైనల్ కు అర్హత సాధించిందని  కోచ్ ఎడవెల్లి అనిల్ కుమార్ శుక్రవారము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయం పట్ల  సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఫైనల్స్ లో  వెంటనే స్పందించి ఉత్తమ ప్రతిభ కనబరచాలని  ఆకాంక్షించి ఇందిర ను అభినందించారు. ఇందిరా అసమాన ప్రతిభ పట్ల
 రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. బాలికను తోటి క్రీడాకారులు, తల్లిదండ్రులు అభినందించారు.

Also Read:  Bheemadevaraplly, Mangalapalli: అక్రమంగా తరలిస్తున్న దూడలు పట్టివేత 

Views: 3
Tags:

About The Author

Latest News