Rural Employment in chittor: తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త... ఇది మీకోసమే
• యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉచితంగా శిక్షణ
On

Andhra Pradesh: తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త...
• యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉచితంగా శిక్షణ
Rural Employment in chittor: గ్రామీణ ప్రాంతంలోని నివసించే నిరుద్యోగ యువతి, యువకులకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ గొప్ప సదవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలో యూనియన్ బ్యాంక్ స్వయం గ్రామీణ ఉపాధి సంస్థ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తుతో పాటు భరోసాను కల్పించే ఉచిత ఉపాధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసింది. ఎవరైతే తెల్ల రేషన్ కలిగి ఉండి, ప్రతిరోజు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరై ఉపాధి శిక్షణా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ అందిస్తున్న శిక్షణను పూర్తి చేసుకోవచ్చు. బ్యాంకు వారు ఇచ్చే శిక్షణతో మనం నివాసమున్నచోటే ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు. మహిళలకు అల్లికలు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మొదలగు కోర్సులలో శిక్షణ ఇస్తారు. పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పై శిక్షణను అందిస్తారు. కావున చిత్తూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి సురేష్ బాబు తెలిపారు.
Views: 20
About The Author
Related Posts
Latest News
21 Apr 2025 21:28:39
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి: ఏసీబీ అధికారులు