CM CONVOY: సీఎం వాహనాలకు ఏం చేశారో తెలుసా..
• TS కు బదులు TG నెంబర్ ప్లేట్లను అమర్చిన సెక్యూరిటీ
On
తెలంగాణ, రాజముద్ర న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తన మార్కును, ప్రజల ఆకాంక్షను చూపించే విధంగా ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే తెలంగాణలో వాహనాలకు నంబర్ ప్లేట్లలో TS బదులు TG గా మార్పులు చేసింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనాలకు నంబర్ ప్లేట్లలో TS కు బదులు TG ని చేర్చారు. TG అనేది తెలంగాణ ఆత్మ గౌరవం అని, తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, యువకులు చాలామంది తమ వాహనాలకు టీజీగా పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో గత ప్రభుత్వం తెలంగాణ స్టేట్ (TS) గా అమలు చేశారు. గత పది సంవత్సరముల నుండి వాహనాలకు టీఎస్ గానే రిజిస్ట్రేషన్ అవుతుంది. గత డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక TS ను తొలగించి TG గా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాహనాల రిజిస్ట్రేషన్ లో మార్పులను చేసింది. ఈనెల 15 నుండి అమల్లోకి వచ్చింది. గతంలో ఉన్న వాహనాలకు టీజీగా మార్చాల్సిన పనిలేదని టీఎస్ గానే ఉండవచ్చునని స్పష్టతనిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా AP పేరుమీద వాహనాలు ఉండేవని, వాటిలో కూడా మార్పు చేయలేదని, ఇప్పుడు కూడా వాహనాల నంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పులు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం నూతన వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో నెంబర్ ప్లేట్లు హై సెక్యూరిటీ కోడ్ తో వస్తాయని పేర్కొన్నారు.
Views: 25
Tags:
About The Author
Related Posts
Latest News
15 Jan 2026 13:29:42
మంత్రి పొన్నంతో కలిసి పూజలు
