Legal Metrology Department: డబ్బులు ఇస్తేనే పని అవుతుంది.. లేదంటే కేసు అవుతుంది

• లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ (Department ) లో అవినీతి జలగలు

On
Legal Metrology Department: డబ్బులు ఇస్తేనే పని అవుతుంది.. లేదంటే కేసు అవుతుంది

•  తూతూ మంత్రంగా తనిఖీలు... డిమాండ్ చేసి డబ్బులు వసూలు..
 
• లంచాల వసూళ్లకు కుటుంబ సభ్యులు, ప్రైవేటు వ్యక్తులు
 
• అవినీతికి కేరాఫ్ అడ్రస్  లీగల్ మెట్రాలజీ (Legal Metrology Department)
 
• డబ్బులు ఇస్తేనే స్టాంపింగ్ వ్యాలిడిటీ సర్టిఫికేట్లు( validity Certificate)
 
• ఇటీవల లంచం తీసుకుంటూ
ఏసీబీకి పట్టుబడ్డ డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్
 
• తూనికలు కొలతలపై ప్రభుత్వం దృష్టి సారించాలి
 
 • చెంగిచెర్ల స్లాటర్ హౌస్ వద్ద కిలో మాంసం కొంటె అర కేజీ వస్తుంది.
 
రాజముద్ర, వెబ్ డెస్క్: కీలకమైన లీగల్ మెట్రాలజీ(తూనికలు కొలతల శాఖ) విభాగంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మనం వాడే ప్రతి వస్తువుపై తూకం(Weight), ఎమ్మార్పీ, ప్యాకేజింగ్, కొలతలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించే ఈ విభాగం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా
మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. స్టాంపింగ్, వ్యాలిడిటీ సర్టిఫికేట్ల జారీ చేయడానికి ఈ శాఖలు పనిచేస్తున్న కొంతమంది ఇన్స్పెక్టర్లు వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.kam 
 
 
కిరాణా దుకాణాలు మొదలు కొని వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు, మాల్స్, టెక్స్ టైల్స్, రెడీమేడ్, గార్మెంట్, టింబర్ డిపోలు, ఎలక్ట్రికల్, హార్డ్వేర్ జ్యూయలరీ, ఎల్పీజీ, ఆయిల్ బిల్లులు, రైస్, ఎరువులు, లిక్కర్, స్టీల్, పురుగుల మందులు, ఫార్మా, కూరగాయలు, మాంసం దుకాణాలు, పండ్లు, స్వీట్స్ ఈ విధంగా 43 విభాగాల్లోని తూనికలు కొలతలకు సంబంధించి క్షేత్రస్థాయి ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్ ల పర్యవేక్షణలో డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్లు పనిచేస్తుంటారు.
07062022vkb6a
 
లీగల్ మెట్రాలజీ చట్టం 23 సెక్షన్ ప్రకారం ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్ (Weighing Machine)ను ఉపయోగించే వ్యాపారులు, కంపెనీల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రతి ఏడాది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదే అదనుగా డిస్టిక్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు వెరిఫికేషన్ చేసి వ్యాలిడిటీ సర్టిఫికేట్లు జారీ చేయడానికి, స్టాంపింగ్ వేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఒక కాంటాకు సంబంధించి స్టాంపింగ్ వేయడానికి గవర్నమెంట్ ఫీజు రూ.300వసూలు చేయాల్సి ఉండగా ఇన్స్పెక్టర్లు రూ.1500వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
09112022001833n17_V_jpg--799x414-4g
వే బ్రిడ్జిల నుండి రూ.5 వేలు, పెట్రోల్ బంకుల నుండి రూ. 15 వేల వరకు ఇన్స్పెక్టర్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో సెట్టింగ్లపై చూసీ చూడనట్లు ఉండడానికి అదనంగా ఇన్స్పెక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఆటో మీటర్ల స్టాంపింగ్లలో ఇన్స్పెక్టర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు కూడా తెలిసింది. కుటుంబ సభ్యులను, బంధువులను, ప్రైవేట్ వ్యక్తులను ఇన్స్పెక్టర్లు తమ అసిస్టెంట్లుగా పెట్టుకొని వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
క్షేత్రస్థాయి ఇన్స్పెక్టర్ల అవినీతిపై అధికారులకు సమాచారమున్న తమకు వాటాలు అందుతుండడంతో వారు గమ్మున ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇటీవల ముషీరాబాద్ చౌరస్తాలో ఉన్న లీగల్ మెట్రాలజీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిస్టిక్ ఇన్స్పెక్టర్ సింగబోయిన ఉమారాణి, టెక్నికల్ అసిస్టెంట్ డి. మల్లేశంలు రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో లీగల్ మెట్రాలజీ విభాగంలో కొనసాగుతున్న అవినీతి బాగోతం ఒక్కసారిగా బట్టబయలైంది.
 
 
లీగల్ మెట్రాలజీ విభాగంలో అవినీతిని సీరియస్ గా పరిగణించిన ఏసీబీ క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ నిఘా పెట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా ఏఎస్, నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట డీఐలు, హైదరాబాద్ జోన్ కు చెందిన ఇద్దరు డిఐల అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.
Views: 75

About The Author

Related Posts

Latest News