Former Minister Malla Reddy: కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి..!
• ప్రియాంక అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ నేతలు..
On

హైదరాబాద్, రాజముద్ర న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా.. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు.. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కుమారుడు చామకూర భద్రారెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది.
బెంగళూరు లోని ఓ హోటళ్లో డీకే శివ కుమార్‌తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది..
Views: 17
Tags:
About The Author
Related Posts
Latest News
05 Sep 2025 20:44:59
మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రులు