Bheemadevarapally,Mulkanoor: ఉచిత వైద్య శిబిరం విజయవంతం 

డిఎంహెచ్వో  వారి సహకారంతో..

On
Bheemadevarapally,Mulkanoor: ఉచిత వైద్య శిబిరం విజయవంతం 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు

ఉచిత వైద్య శిబిరం విజయవంతం 

డిఎంహెచ్వో  వారి సహకారంతో..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు 
పెద్ద సంఖ్యలో హాజరైన జనం

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో మండల కాంగ్రెస్ పార్టీ, హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడం జరిగింది. ఈ శిబిరాన్ని శనివారం నాడు ముల్కనూర్ గ్రామంలోని మోడల్ స్కూల్ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అప్పయ్య, హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ  వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యలను ఆలస్యం చేయడం వల్ల చిన్న వ్యాధులు పెద్దవిగా మారుతున్న నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపయోగకరం అన్నారు. ఈ శిబిరం ప్రజల్లో ఆరోగ్యం పై అవగాహన పెంచడం లో కీలక పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు. ఓపి నమోదు, హెల్ప్ డెస్క్, ల్యాబ్ ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. ఈ హెల్త్ క్యాంప్ కు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, సూచనలు ఇవ్వడంతో పాటు మందులను సైతం ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరంలో 970 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. గుండె, బీపీ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు పంపిణీ చేశారు. మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.వైద్య ఆరోగ్యశాఖ తరఫున 15 మంది డాక్టర్లు, ఫార్మసిస్టులు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఏఎన్ఎంలు ,ఆశా కార్యకర్తలు సేవలందించారు. డిఎంహెచ్వో అప్పయ్య, ముల్కనూర్ ఎస్సై రాజు పర్యవేక్షించారు. వైద్య శిబిరం అనంతరం వైద్యులను గ్రామ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, డిఎంహెచ్వో అప్పయ్య, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ లు శాలువ తో సత్కరించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో... ఎంపీడీవో వీరేశం, తహసీల్దార్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్, మెడికల్ ఆఫీసర్స్ హిమబిందు, రాజశేఖర్, రాం భార్గవ్, రెహమాన్,  కాంగ్రెస్ నాయకులు ఊసకోయిల ప్రకాష్ , చిట్కూరి అనిల్, పోగుల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Vangara: వంగర గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం 

IMG-20260221-WA0014

Also Read:  Bheemadevarapally: పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ 

IMG-20260221-WA0012

 

IMG-20260221-WA0005

Views: 107
Tags:

About The Author

Latest News