Cock Fights: మేడిపల్లిలో కోడిపందాలు ఆడుతున్న 11 మంది అరెస్ట్

• మూడు పందెం కోళ్ళు, 39,600/- నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం

On
Cock Fights: మేడిపల్లిలో కోడిపందాలు ఆడుతున్న 11 మంది అరెస్ట్

• అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఎస్ ఓ టి, మేడిపల్లి పోలీసులు

Cocks Fight: మేడిపల్లి మండలంలోని మూడవ డివిజన్ సత్యనారాయణపురంలో కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి 

- 3 పందెం కోళ్ళు, కోడి కత్తులు, నగదు, సెల్ ఫోన్స్ స్వాధీనం 


- 11 మంది నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు 

IMG-20240625-WA1074


పీర్జాదిగూడ, రాజముద్ర: పందెం కోళ్ళతో కోడిపందాలు నిర్వహిస్తున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

 

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ నగర కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సత్యనారాయణపురం కాలనీలో గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు కోడిపందాలు ఆడుతుండగా సమాచారం అందుకున్న ఎస్ ఓ టి, మేడిపల్లి పోలీసులు కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడి చేశారు. 11 మంది కోడిపందాల రాయుళ్లను పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నున్న 3 పందెం కోళ్ళు,  కోడి కత్తులు, రూ.39, 600/- నగదు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

 

 

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ చేసిన ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి బెట్టింగులకు పాల్పడ్డ చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో కుంచాల శివ, కందుల చెన్నయ్య , మేళం వెంకట్రావు, తన్నీరు హరిప్రసాద్, చప్పా రాములు, తన్నీరు నరసింహారావు, వల్లపు శ్రీను, తన్నీరు నర్సింహ, మేళం రమేష్, మంటల పోతురాజు, రామశెట్టి శ్రీను లు ఉన్నారు.

Views: 1067

About The Author

Related Posts

Latest News