Voter Card Download: ఒక్క నిమిషంలో ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం ఎలా... ఈ విధంగా చేయండి
On

Voter Card Download: ఒక్క నిమిషంలో ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం ఎలా... ఈ విధంగా చేయండి
Voter Card Download: దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేల కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఓటు అప్లై చేసినవారికి శుభవార్త అందించింది. తెలంగాణలోని హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి (Ranga Reddy), మేడ్చల్ (Medchal), వికారాబాద్ (Vikarabad) జిల్లాల వారు ఒక్క నిమిషంలో ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చును. ముందుగా గూగుల్ లోకి వెళ్లి voter.eci.govt.In అనే వెబ్ సైట్ ను టైప్ చేసినట్లయితే మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. మొదటి ఆప్షన్ ఒకవేళ మన మొబైల్ కు ఓటర్ కార్డు నెంబరు ఉన్నట్లయితే ఓటర్ కార్డు నెబర్ను ఎంటర్ చేయాలి, తరువాత మనం అప్లై చేసిన జిల్లాను పెంచుకోవాలి. ఆ తరువాత మన ఫోనుకు ఒక ఓటీపీ నెంబర్ (OTP) వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ను సంబంధిత కాలములో ఎంటర్ చేసినట్లయితే పిడిఎఫ్ రూపంలో మన ఓటర్ కార్డు డౌన్లోడ్(Download) అవుతుంది. రెండవ ఆప్షన్ మనకు ఓటర్ కార్డు(voter card) లేనట్లయితే అప్లై చేసినప్పుడు మన మొబైల్ కు ఒక రిఫరెన్స్ నెంబర్ (Reference Number) వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ను సంబంధిత కాలములో టైప్ చేసి జిల్లాను ఎంచుకొని డౌన్లోడ్(Download ) ఆప్షన్ కొట్టగానే మరల ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీని ఆ యొక్క కాలంలో టైప్ చేసినట్లయితే మన ఓటర్ కార్డు సులభంగా పిడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మన ఇంటి నుండే ఓటర్ కార్డును పొందవచ్చును.
Views: 328
About The Author
Related Posts
Latest News
09 Aug 2025 10:33:38
యజ్ఞోపవీత శుభాకాంక్షలు తెలుపుకున్న పద్మశాలి కులస్తులు